నారాయణపేట జిల్లా, మక్తల్, నర్వ మండలం కుమార్ లింగంపల్లి గ్రామానికి చెందిన అరుణ ఎంబిబిఎస్ సీటు సాధించింది. ఈ సందర్భంగా మండల
కాంగ్రెస్ అధ్యక్షులు చెన్నయ్య సాగర్ ఆమెను శనివారం ఘనంగా సన్మానించి, ఆమె విజయం యువతకు స్ఫూర్తిదాయకమని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.