ఉత్తమ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం కు సన్మానం

507చూసినవారు
ఉత్తమ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం కు సన్మానం
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మంతన్గోడు గ్రామ ఎంపీపిఎస్ పాఠశాల కు చెందిన హెచ్ఎం పరమేశ్వరి జిల్లా స్థాయి ఉత్తమ ప్రాథమిక పాఠశాల HM గా ఎంపికైన సందర్భంగా సర్పంచ్ రాజేందర్ గౌడ్, గ్రామ పెద్దలు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు ఆమెను జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. సర్పంచ్ రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఇంగ్లీష్ విద్య అందుతోందని, ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సుజాత పాఠశాల ఉపాధ్యాయులు శ్రీకాంత్, మంజుల, శ్రీనివాస్, మమత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్