జూరాల ప్రాజెక్టు వద్ద బిజెపి నాయకుల అరెస్టుపై విమర్శలు

504చూసినవారు
జూరాల ప్రాజెక్టు వద్ద బిజెపి నాయకుల అరెస్టుపై విమర్శలు
మక్తల్ పట్టణంలో జూరాల ప్రాజెక్టు ఆయకట్టు కింద పంటలకు నీటిని విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ చలో జూరాల కార్యక్రమానికి బయలుదేరుతున్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్యతో పాటు పలువురు ముఖ్య నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల రైతులు నష్టపోతున్నారని, వెంటనే నీటిని విడుదల చేయాలని మంగళవారం బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. అరెస్టులు, గృహ నిర్బంధాలతో బిజెపి ఉద్యమాన్ని ఆపలేరని వారు విమర్శించారు.

సంబంధిత పోస్ట్