నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో గత కొన్ని రోజులుగా కుక్కల బెడద తీవ్రమైంది. గత నెల 29న 11 మందిని కుక్కలు కరవడంతో స్థానికులు ఈ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి ఆదేశాల మేరకు, బుధవారం కుక్కలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని రప్పించారు. మున్సిపల్ చైర్మన్ వాకిటి మానస పర్యవేక్షణలో పట్టణంలో తిరుగుతున్న కుక్కలను పట్టుకొని వ్యాన్లలో తరలించారు. కుక్కలను తరలించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.