రైతు పొలాల్లో ఫారం పాండ్స్ పనులు ప్రారంభించాలి.. ఎంపీడీవో

0చూసినవారు
రైతు పొలాల్లో ఫారం పాండ్స్ పనులు ప్రారంభించాలి.. ఎంపీడీవో
మక్తల్ మండలంలోని ప్రతి గ్రామపంచాయతీలో రెండు చొప్పున ఫారం పాండ్స్ పనులు వెంటనే ప్రారంభించాలని ఎంపీడీవో శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కనీసం 40 మంది కూలీలకు ఉపాధి కల్పించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎంపీవో రాఘవేందర్, ఏపీవో గౌరిశంకర్, అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు మరియు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్