నారాయణపేట జిల్లా, మక్తల్ పరిధిలోని నర్వ మండలం లంకాల గ్రామ అంగన్వాడీ కేంద్రాన్ని MPDO శ్రీనివాస్ సోమవారం, పరిశీలించారు. పెన్షన్ లబ్ధిదారుల పరిశీలనలో భాగంగా వచ్చిన ఆయన, పిల్లల సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. అనంతరం అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజబాబు, ఉప సర్పంచ్ విజయ్ రామ్ పాల్గొన్నారు.