సంగంబండ రిజర్వాయర్ ముంపునకు గురైన గార్లపల్లి గ్రామస్తులు, పునఃనిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిలో గుడి కట్టడానికి అనుమతి కోరుతూ అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు అభ్యంతరం చెప్పడంతో ఈ ఆందోళన మొదలైంది. తహశీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించిన గ్రామస్తులకు, రెండు రోజుల్లో సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తామని తహశీల్దార్ సతీష్ కుమార్ హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు. ప్రభుత్వం 169, 170 సర్వే నెంబర్లలో 24 ఎకరాల 14 గుంటల భూమిని ఆర్ఆర్ సెంటర్ కి కేటాయించింది.