నర్వ మండలంలోని ఉండేకోడ్ గ్రామంలో మంగళవారం కొత్త బోరుమోటార్‌ను మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చెన్నయ్య సార్ మరియు ఎంపీడీవో శ్రీనివాస్ ప్రారంభించారు. త్రాగునీటి సమస్యను గ్రామ నాయకులు మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే స్పందించి ఎమ్మెల్యే నిధుల నుండి రూ.1.25 లక్షలు మంజూరు చేసి బోరు వేయించారు. గ్రామస్థులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.