నారాయణపేట జిల్లా మక్తల్ మండలం అనుగొండ గ్రామంలో శ్రీ పోలేరమ్మ బోనాల జాతర వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు గ్రామ దేవత పోలేరమ్మకు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుశీల ఆంజనేయులు, ఉప సర్పంచ్ నంబర్ తిరుపతి, గ్రామ వార్డ్ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఈ జాతర వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి.