మంతన్ గౌడ్ పాఠశాలలో ఘనంగా P.T.M

369చూసినవారు
మంతన్ గౌడ్ పాఠశాలలో ఘనంగా P.T.M
మక్తల్ మండలం మంతన్గోడు పాఠశాలలో హెచ్ఎం పరమేశ్వరి ఆధ్వర్యంలో తల్లిదండ్రుల-ఉపాధ్యాయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ రాజేందర్ గౌడ్ హాజరయ్యారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు ఆంగ్లంలో నిపుణులు కాకపోయినా ఇంట్లోనే పిల్లలకు సహాయపడే 3 సులభ పద్ధతులను పాటించాలని అన్నారు. ​రోజూ బడిలో జరిగిన విషయాలను ఆంగ్లంలో చెప్పమని అడగడం, పిల్లలు ఆంగ్లంలో మాట్లాడేటప్పుడు తప్పులు దిద్దకుండా ఆసక్తిగా వినడం, ​ఇంట్లోని వస్తువులు, బోర్డులపై ఉన్న ఇంగ్లీషు పదాలను కలిసి చదవడం చేయించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్