దీపావళి పటాకుల దుకాణాలపై నిబంధనల పకడ్బందీ

0చూసినవారు
దీపావళి పటాకుల దుకాణాలపై నిబంధనల పకడ్బందీ
నారాయణపేట జిల్లా మక్తల్‌లో దీపావళి సందర్భంగా ఏర్పాటు చేయబోయే బాణసంచా దుకాణాలపై మక్తల్ సీఐ రామ్ లాల్ మరియు ఎస్సై రాజు సంబంధిత వ్యాపారులతో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దుకాణాల నిర్వహణకు పోలీస్, మునిసిపల్ మరియు అగ్నిమాపక శాఖల అనుమతులు తప్పనిసరి అని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే దుకాణాలు ఏర్పాటు చేయాలని, అగ్ని ప్రమాదాల నివారణకు నీరు, ఇసుక బకెట్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ రాజయ్య, ఫైర్ అధికారి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్