కృష్ణ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడ్డేబల్లూరు గ్రామ శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది, కృష్ణ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో టిప్పర్, ఐదు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో మాగనూరు పెద్దవాగు, కృష్ణ నది పరివాహక ప్రాంతాల నుంచి జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాపై 'దిశ' పత్రికలో వచ్చిన కథనాల నేపథ్యంలో అధికారులు స్పందించి, కట్టడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే స్పెషల్ టాస్క్ ఫోర్స్, కృష్ణా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆకస్మిక దాడులు నిర్వహించారు. పట్టుబడిన ఆరుగురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అక్రమ ఇసుక రవాణా, నిల్వలు, అమ్మకాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని, అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై ఎంఎస్ నవీద్ హెచ్చరించారు.