పరిశ్రమలో విషవాయువు లీక్: యువకుడి మృతి, గ్రామస్తుల ఆందోళన

0చూసినవారు
పరిశ్రమలో విషవాయువు లీక్: యువకుడి మృతి, గ్రామస్తుల ఆందోళన
నారాయణపేట జిల్లా, మక్తల్ నియోజకవర్గం సరిహద్దులోని కడెచూరు-బాడియాల్ పారిశ్రామికవాడలో బుధవారం తెల్లవారుజామున విషవాయువు లీకై కృష్ణ మండలానికి చెందిన గణేష్ మృతి చెందాడు. ఈ దుర్ఘటనతో ఆగ్రహించిన కడచూర్ గ్రామస్తులు, పరిశ్రమల వల్ల తమ గ్రామం కాలుష్య కాసారంగా మారుతోందని, వెంటనే పరిశ్రమలను తొలగించి, బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని కర్ణాటక యువజన సంఘం అధ్యక్షుడు వీరేష్ సజ్జన్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పరిశ్రమ ముందు కృష్ణ మండల నాయకులు, కడచూర్ గ్రామ పెద్దలు ఆందోళన చేపట్టారు.

సంబంధిత పోస్ట్