కర్ణాటక పరిశ్రమలో విషవాయువు లీక్.. ఆలంపల్లి యువకుడు మృతి

2చూసినవారు
కర్ణాటక పరిశ్రమలో విషవాయువు లీక్.. ఆలంపల్లి యువకుడు మృతి
మక్తల్ నియోజకవర్గం సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రంలో, కడెచూర్-బాడియాల్ పారిశ్రామిక వాడలో గల సిల్ లాబరేటరీస్ పరిశ్రమంలో బుధవారం ఉదయం విషవాయువు లీకైంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మరణించారు. మృతుల్లో కృష్ణ మండలం ఆలంపల్లి గ్రామానికి చెందిన గణేష్ (21) కూడా ఉన్నారు. మరికొంతమంది అస్వస్థతకు గురికావడంతో వారిని రాయచూర్ రిమ్స్ కు తరలించినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆలంపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్