నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహాన్నిసోమవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన నెరడగం పశ్చిమాద్రి సంస్థాన విరక్తమఠ పీఠాధిపతి సిద్ధలింగ మహ స్వాములు మాట్లాడుతూ 39 ఏళ్లు మాత్రమే జీవించినా వివేకానందుడు భారతదేశానికి ఎంతో జ్ఞానాన్ని అందించారని, నేటి యువతకు ఆయన స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. వివేకానందుడి ఆశయాలకు అనుగుణంగా దేశం, ధర్మం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.