నర్సిరెడ్డిపల్లి శివారులో మహిళ దారుణ హత్య

0చూసినవారు
నర్సిరెడ్డిపల్లి శివారులో మహిళ దారుణ హత్య
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం నర్సిరెడ్డిపల్లి (బొందల్ కుంట) గ్రామ శివారులోని 167వ రహదారి పక్కన గుడిగండ్ల గ్రామానికి చెందిన యశోద (28) అనే మహిళ గురువారం దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె తలపై బండరాయితో మోది ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్