Jan 24, 2026, 16:01 IST/నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్
అచ్చంపేట: గ్రామాభివృద్ధికి సహకరించండి: ఎమ్మెల్యే
Jan 24, 2026, 16:01 IST
నాగర్ కర్నూల్ జిల్లా లింగాల గ్రామ నూతన పాలకవర్గం అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పిలుపునిచ్చారు. శనివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ బుడ్డయ్య తో పాటు వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. గ్రామంలోని మౌలిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు సూచించారు.