నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, ఆయన సతీమణి చిక్కుడు అనురాధ బుధవారం హైదరాబాద్‌లోని తమ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి, తమ కుమారుని వివాహ మహోత్సవానికి ఆహ్వానించారు. మే 3న హైదరాబాద్‌లో జరగనున్న డాక్టర్ యశ్వంత్ వివాహానికి హాజరుకావాలని కోరారు. వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని వారు తెలిపారు.