మంగళవారం సాయంత్రం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరించింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని గుండం తొవ్వ సమీపంలో పులి కనిపించడంతో స్థానికులు దానిని ఫోన్ లో వీడియో తీసి వైరల్ చేశారు. సఫారీకి వెళ్లిన పర్యాటకులు పులిని చూసి ఆనందం వ్యక్తం చేశారు.