శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట-లింగోటం గ్రామాల మధ్య మురుగు నీటి తరలింపు విషయంలో ఘర్షణ చోటుచేసుకుంది. తమ గ్రామానికి మురుగు నీటిని తరలించొద్దని అచ్చంపేట గ్రామస్థులు లింగోటం యువకులపై బీరు సీసాలు, కర్రలతో దాడి చేశారని బాధితులు ఆరోపించారు. తమపై కుల వివక్ష చూపుతున్నారని, కేసులు పెడతామని, మురికి నీరు తరలిస్తామని బెదిరించారని బాధితులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని వారు కోరారు.