అచ్చంపేట: ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

705చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పరిసరాల్లో శనివారం సాయంత్రం నుండి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, మట్టి రోడ్లు బురదమయంగా మారాయి. కాలనీలలో నీరు నిలిచిపోవడంతో దోమల బెడద పెరిగి, రోగాల బారిన పడే ప్రమాదం ఉందని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి నీటి నిల్వలను అరికట్టాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్