అచ్చంపేట: వంతెన నిర్మాణానికై సీతక్కకు ఎమ్మెల్యే ఫోన్

337చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చౌటపల్లి-బాణాల రహదారిపై వాగు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో బాణాల, బిల్లకల్లు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హైలెవెల్ వంతెన అవసరాన్ని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ శనివారం మంత్రి సీతక్కకు ఫోన్లో వివరించారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, బ్రిడ్జి నిర్మాణానికి తక్షణమే సహకరిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్