నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం నల్లమల ప్రాంతంలోని మద్దిమడుగు శ్రీశ్రీశ్రీ పబ్బతి మద్దిమడుగు అంజనేయ స్వామిని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, ఎంపీ మల్లు రవి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లమల ప్రజలు, భక్తుల చిరకాల కోరిక మేరకు శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి క్షేత్రం మద్దిమడుగులో ఏర్పాటు చేసిన సెల్ టవర్ పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆంజనేయస్వామి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఇబ్బందులు తొలగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.