అచ్చంపేట: నల్లమల అడవుల్లో రాయల్ బెంగాల్ టైగర్

1394చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ అడవుల్లో శనివారం రాయల్ బెంగాల్ టైగర్ కనిపించింది. వర్షాలతో పచ్చగా మారిన నల్లమల అడవుల్లో చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ పర్యాటకులు ఈ దృశ్యాలను కెమెరాలో బంధించారు. పులుల స్వేచ్ఛాయుత సంచారం అటవీ పర్యావరణం ఆరోగ్యంగా ఉందని, అటవీ శాఖ సంరక్షణ చర్యలు పటిష్టంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్