నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండలం పెద్దాపూర్ లో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ఆదివారం ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ లబ్ధిదారుల ఆహ్వానం మేరకు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,
కాంగ్రెస్ ప్రజా పాలనలో పేదల సొంత ఇంటి కల నెరవేరిందని, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పేదవారి కలలు నెరవేర్చడంలో ఇందిరమ్మ రాజ్యం పాటు పాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.