అచ్చంపేట: రాత్రి పెట్రోలింగ్లో కనిపించిన పులి

1780చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ నల్లమల అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఫారెస్ట్ సిబ్బందికి పులి కనిపించింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లోని కోర్ ఏరియాలో విధులు నిర్వహిస్తుండగా, మార్గం మధ్యలో పులి సంచరించడం గమనించిన సిబ్బంది అప్రమత్తమయ్యారు. అడవిలో వన్యప్రాణుల సంచారం పెరగడంతో స్థానికులు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్