అచ్చంపేట: రిజర్వ్ లో పర్యాటకులకు కనిపించిన పులి

1297చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో ఆదివారం పర్యాటకులకు అరుదైన దృశ్యం కనిపించింది. టైగర్ సఫారీలో వెళ్తున్న పర్యాటకులకు ఒక పులి ప్రత్యక్షమైంది. పర్యాటకులు ఆనందంతో పులిని తమ కెమెరాల్లో బంధించారు. పర్యాటక సీజన్ కావడంతో అమ్రాబాద్ అడవుల్లో ఇలాంటి వన్యప్రాణుల దర్శనం పర్యాటకులకు మంచి అనుభూతిని అందిస్తోంది.

సంబంధిత పోస్ట్