వంతెన నిర్మాణ పనులు నాణ్యతగా చేపట్టాలి: ఎమ్మెల్యే

341చూసినవారు
వెల్దండ మండలంలోని గానుగగట్టు తాండ సమీపంలో చేపట్టిన వంతెన నిర్మాణ పనులను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బుధవారం పరిశీలించారు. సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి వంతెనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, వంతెన నిర్మాణ పనులను వేగవంతంగా, నాణ్యతగా చేపట్టాలని సూచించారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హరి కిషన్ నాయక్ తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్