విద్యార్థులకు నాణ్యమైన విద్యే ప్రభుత్వ లక్ష్యం: జూపల్లి

965చూసినవారు
మైనార్టీ విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య, ఆధునిక వసతులు కల్పించి, వారిని అన్ని రంగాల్లో పోటీతత్వానికి సిద్ధం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కొల్లాపూర్ ఎమ్మెల్యే, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శనివారం ఆదిలాబాద్‌లోని బంగారుగూడలో రూ. 20 కోట్ల వ్యయంతో నిర్మించిన మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల-కళాశాల (బాలుర) భవనాన్ని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి ఆయన ప్రారంభించారు. మైనార్టీలకు విద్యారంగంలో సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్