కల్వకుర్తి 11వ వార్డును ఆదర్శంగా మారుస్తా: దార దాసు

285చూసినవారు
కల్వకుర్తి 11వ వార్డును ఆదర్శంగా మారుస్తా: దార దాసు
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కల్వకుర్తి పట్టణంలోని 11వ వార్డులో సీపీఐ పార్టీ అభ్యర్థి దార దాసు, నియోజకవర్గ ఇన్చార్జ్ పరశురాములతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తాను గెలిస్తే 11వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని దార దాసు ఓటర్లకు హామీ ఇచ్చారు. సీపీఐ కార్యకర్తలు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఓటర్లను ఆదరించి గెలిపించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్