ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలు అందించే లక్ష్యంతో నిర్మల్ పట్టణంలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ – కూచాడి సత్యమ్మ ప్రకాశ్ రావు కంటి పరీక్ష కేంద్రాన్ని శనివారం కొల్లాపూర్ ఎమ్మెల్యే, పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా మారుమూల ప్రాంతాల ప్రజలు కూడా సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా నిర్మల్‌లోనే కంటి
పరీక్షలు చేయించుకునే అవకాశం లభిస్తుందని, ప్రారంభ దశలోనే కంటి సమస్యలను గుర్తించి వైద్యం పొందవచ్చని మంత్రి తెలిపారు.