కల్వకుర్తి: ఆటో బోల్తా.. బాలుడు స్పాట్ డెడ్

1499చూసినవారు
కల్వకుర్తి: ఆటో బోల్తా.. బాలుడు స్పాట్ డెడ్
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఊర్కొండ మండల పరిధిలోని జగబోయినపల్లి గేటు సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ఆటో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్