నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తన స్వగృహంలో బాధిత కుటుంబాలకు బుధవారం అందజేశారు. వెల్దండ మండలానికి చెందిన పలువురికి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పర్వత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.