నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం చారకొండ మండలంలో శనివారం సాయంత్రం ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. మండల కేంద్రంతో పాటు జూపల్లి తదితర గ్రామాల్లో వాన జోరుగా కురుస్తోంది. మృగశిర కార్తె ప్రవేశించిన తర్వాత శుక్రవారం రాత్రి కురిసిన వర్షంతో పాటు, శనివారం కూడా వాన పడటంతో పొలాల్లో విత్తనాలు వేసేందుకు అనుకూలంగా ఉంటుందని, ఈ వర్షాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.