ఆస్తి వివాదంలో జరిగిన హత్య కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కల్వకుర్తి డీఎస్పీ సాయిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ నెల 4వ తేదీన నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం పోతేపల్లి రోడ్డులో కారును టిప్పర్ ఢీకొట్టడంతో రుద్రాక్షల మహేష్ (27) మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మనుపటి అన్వేష్, శివ, పవన్, వెంకటమ్మ, రుద్రాక్షల కృష్ణయ్య, ఎండి బురాన్ లను మంగళవారం అరెస్ట్ చేశారు.