కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని పులిగోని తాండలో మంగళవారం హృదయ విదారక ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వివరాల ప్రకారం... తాండాకు చెందిన రాందాస్ నాయక్ ఆమనగల్లోని కాటన్ మిల్లులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వివాహం జరిగినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి, మంగళవారం మరొకసారి కుటుంబ కలహాలు చెలరేగడంతో, మద్యం మత్తులో ఉన్న రాందాస్ నాయక్ ఒక్కసారిగా ఆగ్రహానికిలోనై భార్య కవిత, కుమారుడు ప్రణీత్ (6),కుమార్తె ప్రణీత (8)పై కత్తితో దాడి చేశాడు. కవిత, ప్రణీత్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ప్రణీత ప్రాణాపాయ స్థితిలో ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.