కొల్లాపూర్ ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు
కాంగ్రెస్ శ్రేణులను హెచ్చరించారు. ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా అంశంపై అప్రమత్తంగా లేకపోతే ఓటరు జాబితాలో పేర్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. బీఎల్ఓలతో స్నేహపూర్వకంగా ఉంటూ వారు అడిగే ప్రతి ప్రశ్నకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని సూచించారు. చిన్న పొరపాటు జరిగినా తిరిగి ఓటరు జాబితాలో పేరు నమోదు చేయడం కష్టమవుతుందని, అవసరమైన వివరాలను బిఎల్ఓలకు అందజేయాలని ఆయన కోరారు.