రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధిస్తుందని కొల్లాపూర్ ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం మంచిర్యాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, ప్రతి మున్సిపాలిటీలో 75 శాతానికి తగ్గకుండా కాంగ్రెస్ కౌన్సిలర్లు గెలుపొందుతారని జోస్యం చెప్పారు. ప్రజా మద్దతుతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ఆయన స్పష్టం చేశారు.