కొల్లాపూర్: కృష్ణానది తీరాన కృష్ణ జింకల సందడి

1398చూసినవారు
శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలంలోని కృష్ణానది తీరాన వందలాది కృష్ణ జింకలు సందడి చేశాయి. కృష్ణానది తీరం వన్యప్రాణుల విహార కేంద్రంగా మారడంతో, ఈ అరుదైన జీవులను రక్షించేందుకు అటవీ శాఖ తక్షణమే ప్రత్యేక చర్యలు చేపట్టాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. ఈ దృశ్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది.

సంబంధిత పోస్ట్