కొల్లాపూర్: ప్రజాప్రతినిధుల్లో ఉత్సాహం నింపేందుకే ఈ క్రీడలు

345చూసినవారు
కొల్లాపూర్: ప్రజాప్రతినిధుల్లో ఉత్సాహం నింపేందుకే ఈ క్రీడలు
శనివారం నగరంలోని ఎల్బీ స్టేడియంలో 'తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్-2026' (మొదటి ఎడిషన్) ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు క్రీడాజ్యోతిని వెలిగించి, బెలూన్లను గాల్లోకి ఎగురవేసి ఈ క్రీడా ఉత్సవాన్ని ప్రారంభించారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారంలో నిమగ్నమయ్యే ప్రజాప్రతినిధులకు శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం ఎంతో అవసరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఒకే వేదికపై క్రీడా స్ఫూర్తిని చాటడం శుభపరిణామమని ఆయన కొనియాడారు. ఈ క్రీడా మీట్ శాసనసభ్యుల పని ఒత్తిడిని తగ్గించి, వారిలో నూతన ఉత్తేజాన్ని నింపేందుకు రూపొందించబడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్