ప్రవీణ్ కుమార్ భద్రత తొలగింపుపై మాదిగ దండోరా నాయకుడు ఉదయ్ ఆగ్రహం

1058చూసినవారు
ప్రవీణ్ కుమార్ భద్రత తొలగింపుపై మాదిగ దండోరా నాయకుడు ఉదయ్ ఆగ్రహం
బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్కు ప్రభుత్వం భద్రత తొలగించడం సరికాదని మాదిగ దండోరా నాయకుడు ఉదయ్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో, బుల్లెట్ ప్రూఫ్ వాహనం తొలగింపు, రక్షణ సిబ్బంది తొలగింపు వంటివి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించడమేనని ఆయన విమర్శించారు. ప్రవీణ్ కుమార్కు ఏదైనా జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని ఉదయ్ హెచ్చరించారు. ఈ సంఘటనపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్