నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులకు 10 రోజుల్లో పరిష్కారం చేస్తామని తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 41 దరఖాస్తులు స్వీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దరఖాస్తులను సంబంధిత శాఖలకు బదిలీ చేసి, తక్షణమే పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.