నాగర్ కర్నూల్: కారు, బస్సు ఢీ..!

1266చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామ సమీపంలో ఆదివారం ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న సంఘటన స్థానికంగా కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూల్ డిపోకు వస్తున్న ఆర్టీసీ బస్సు, తిమ్మాజీపేట వైపు వెళ్తున్న కారును ఢీకొట్టింది. రహదారిపై వేగంగా రావడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదంపై పూర్తి సమాచారం వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్