నాగర్ కర్నూల్: సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ

262చూసినవారు
నాగర్ కర్నూల్: సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ
మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న ఆరోగ్య సేవలు మరింత మెరుగుపడేలా పలు కీలక సూచనలు చేశారు. ఓపీ, ఐపీ విభాగాలు, రికార్డు నిర్వహణ, ల్యాబ్, మెడికల్ ఫార్మసీ తదితర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి విభాగంలో సేవల నాణ్యత, సిబ్బంది పనితీరు, రోగులకు అందుతున్న సౌకర్యాలను సంబంధిత అధికారులతో చర్చించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి, వైద్య సేవలపై సమస్యలను తెలుసుకున్నారు. రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన కలెక్టర్, వాటిని వెంటనే పరిష్కరించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్