నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్డినరీ బస్సును ఆదివారం 'మైసమ్మ స్పెషల్' పేరుతో నడుపుతూ ఎక్స్ ప్రెస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆర్డినరీ సౌకర్యాలు కల్పిస్తూనే అధిక ఛార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి, ప్రత్యేక సేవల పేరుతో అదనపు భారం మోపడాన్ని నివారించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.