నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ వార్త తెలియగానే బాధితులు, స్థానికులు పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం సాయంత్రం టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అవినీతిపై ఏసీబీ వేటు వేయడాన్ని మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.