మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోశ్ హెచ్చరించారు. బుధవారం అదనపు కలెక్టర్లతో కలిసి నిబంధనల అమలుపై నోడల్, జోనల్ అధికారులకు నిర్వహించిన శిక్షణలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల నిబంధనల అమలులో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.