నాగర్ కర్నూల్: డాగ్ స్క్వాడ్ ప్రత్యేక తనిఖీలు

134చూసినవారు
నాగర్ కర్నూల్: డాగ్ స్క్వాడ్ ప్రత్యేక తనిఖీలు
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఆదేశాల మేరకు అంబేడ్కర్ చౌరస్తాలో శనివారం డాగ్ స్క్వాడ్ తో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మాదకద్రవ్యాలు, అనుమానాస్పద వస్తువులను గుర్తించడంపై పోలీసులు దృష్టి సారించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే తమ లక్ష్యమని అధికారులు తెలిపారు. మాదకద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతున్నాయని, అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంటుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్