నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని 6వ వార్డులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అర్హులకు ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.