మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం రెండో రోజు మహబూబ్ నగర్ కార్పొరేషన్ తో పాటు పలు మున్సిపాలిటీల్లో మొత్తం 800కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం నామినేషన్లు భారీగా దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ కు 195, దేవరకద్ర 29, భూత్ పూర్ 17, నాగర్ కర్నూల్ 85, కల్వకుర్తి 71, కొల్లాపూర్ 53, గద్వాల 61, అయిజ 25, వడ్డేపల్లి 23, అలంపూర్ 16, వనపర్తి 133, పెబ్బేర్ 33, కొత్తకోట 35, ఆత్మకూరు 36, అమరచింత 32, నారాయణపేట 36, మద్దూరు 22, మక్తల్ 40, కోస్గిలో 27 నామినేషన్లు వచ్చాయి.